Monday, August 1, 2016

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన.
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి.
ఓం నమో వేంకటేశాయ.పైన చెప్పబడిన శ్లోకమునకు అర్ధమేమనగా, సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వర స్వామివారు ఎల్లప్పుడూ వేంచేసి యుండే ఆ తిరుమల తిరుపతి తో సమానమైన ప్రదేశము మరియు శ్రీ వేంకటేశ్వర స్వామివారితో సమానముగ తులతూగునటువంటి దైవమును ఈ విశ్వమునందు భూత భవిష్యద్వర్తమాన కాలములలో లేరు, యుండరు.
కనుక, మనమంతా కలసి ఆ స్వామివారిని సులభముగ అర్చించుటకుగాను ఒరిస్సా రాష్ట్రములోనున్న జాజ్పూర్ రోడ్ లో {అనగా అష్టాదశ పీఠములలో ఒకటైన శ్రీ విరజా క్షేత్రమునకు (ఈ క్షేత్రమునే శ్రీ లలితా సహస్రమునందు "ఓడ్యాణా పీఠ నిలయే బిందు మండల వాసిని" అని వివరింప బడినది)} 30 కి. మి. దూరములోనున్న మరియు రైల్వే ష్టేషనుకు 5 కి. మి. దూరములోను, మేము అనగా శ్రీ వేంకటేస్వర టెంపుల్ ట్రష్ట్ (ఎస్. వి. టి. టి.) శ్రీ స్వామివారి ఆలయమును నిర్మించుటకుగాను 12.10.2013 న హిజ్ హోలీ హైనెస్ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి శిష్యులైన హిజ్ హోలీ హైనెస్ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామివారి స్వహస్తములతొ శంఖుస్థాపన మహోత్సవమును జరిపించినాము. ఈ మహోత్సమము యొక్క చిత్రపటములను ఈ దిగువన పొందుపరచినాము.



ప్రస్తుతము అనగా 01.08.2016 నాటికి ముఖ్య ఆలయము యొక్క డెజైన్ పని, అర్ధ మండపము, మండపము, గరుడాలయము యొక్కయొఉ మరియు ధ్వజస్థంభము యొక్క ఫౌండేషన్ పూర్తి కాగా ఇంకను పనివారు పని చేయుచున్నారు. ఏ సంవత్సరము చివరినాటికి పూర్తి పనులు కాగలవని మా నమ్మకము. కానీ భక్తులందరితొ మా విన్నపమేమనగా మీరంతా కలసి ఇప్పటివరకు ఆర్హిక సహాయము ఎటుల జేసినారో అటులనె మాకు అండగా నిలబడి ఆర్ధిక సహకారము అందజేయుదురని ఆశిస్తూ 



మీ
 ఎస్. వి. టి. టి. 
ఓం నమో వేంకటేశాయ: